circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- కొలొస్సయులకు 2:12సుమారు క్రీ.శ. 64
ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.
- కొలొస్సయులకు 2:13సుమారు క్రీ.శ. 64
మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు,
- కొలొస్సయులకు 2:14సుమారు క్రీ.శ. 64
మనకు వ్యతిరేకంగా ఉండి, మనల్ని శిక్షకు గురి చేసే రుణపత్రాన్ని రద్దుచేశారు; ఆయన దానిని తీసివేసి, దానిని సిలువకు మేకులతో కొట్టారు.
- కొలొస్సయులకు 2:15సుమారు క్రీ.శ. 64
ఆయన సిలువ ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించారు.
- కొలొస్సయులకు 2:16సుమారు క్రీ.శ. 64
కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి.
- కొలొస్సయులకు 2:17సుమారు క్రీ.శ. 64
ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది.
- కొలొస్సయులకు 2:18సుమారు క్రీ.శ. 64
ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు.
- కొలొస్సయులకు 2:19సుమారు క్రీ.శ. 64
వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.
- కొలొస్సయులకు 2:20సుమారు క్రీ.శ. 64
మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!”
- కొలొస్సయులకు 2:21సుమారు క్రీ.శ. 64
అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు?
- కొలొస్సయులకు 2:22సుమారు క్రీ.శ. 64
ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి.
- కొలొస్సయులకు 2:23సుమారు క్రీ.శ. 64
అలాంటి నియమాలు, వారి స్వయంకృత ఆరాధన విషయంలో, అతి వినయం విషయంలో, శరీరాన్ని హింసించుకోవడం జ్ఞానంగా అనిపించవచ్చు, కాని శారీరక ఆశలను చంపుకోవడంలో అలాంటి నియమాలకు ఎలాంటి విలువలేదు.
- కొలొస్సయులకు 3:1సుమారు క్రీ.శ. 64
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు.
- కొలొస్సయులకు 3:2సుమారు క్రీ.శ. 64
భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి.
- కొలొస్సయులకు 3:3సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది.
- కొలొస్సయులకు 3:4సుమారు క్రీ.శ. 64
మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.
- కొలొస్సయులకు 3:5సుమారు క్రీ.శ. 64
కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.
- కొలొస్సయులకు 3:6సుమారు క్రీ.శ. 64
వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది.
- కొలొస్సయులకు 3:7సుమారు క్రీ.శ. 64
ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు.
- కొలొస్సయులకు 3:8సుమారు క్రీ.శ. 64
కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి.
- కొలొస్సయులకు 3:9సుమారు క్రీ.శ. 64
మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు,
- కొలొస్సయులకు 3:10సుమారు క్రీ.శ. 64
సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.
- కొలొస్సయులకు 3:11సుమారు క్రీ.శ. 64
ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు.
- కొలొస్సయులకు 3:12సుమారు క్రీ.శ. 64
కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.
- కొలొస్సయులకు 3:13సుమారు క్రీ.శ. 64
ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి.