circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఫిలిప్పీయులకు 4:14సుమారు క్రీ.శ. 64
అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.
- ఫిలిప్పీయులకు 4:15సుమారు క్రీ.శ. 64
అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు.
- ఫిలిప్పీయులకు 4:16సుమారు క్రీ.శ. 64
నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు.
- ఫిలిప్పీయులకు 4:17సుమారు క్రీ.శ. 64
నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.
- ఫిలిప్పీయులకు 4:18సుమారు క్రీ.శ. 64
నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము.
- ఫిలిప్పీయులకు 4:19సుమారు క్రీ.శ. 64
నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.
- ఫిలిప్పీయులకు 4:20సుమారు క్రీ.శ. 64
మన తండ్రియైన దేవునికి మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
- ఫిలిప్పీయులకు 4:21సుమారు క్రీ.శ. 64
క్రీస్తు యేసులో దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి. నాతోకూడ ఉన్న సహోదరీ సహోదరులందరు మీకు వందనాలు చెప్తున్నారు.
- ఫిలిప్పీయులకు 4:22సుమారు క్రీ.శ. 64
ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు ముఖ్యంగా కైసరు కుటుంబానికి చెందినవారు మీకు వందనాలు చెప్తున్నారు.
- ఫిలిప్పీయులకు 4:23సుమారు క్రీ.శ. 64
ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.
- కొలొస్సయులకు 1:1సుమారు క్రీ.శ. 64
దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది:
- కొలొస్సయులకు 1:2సుమారు క్రీ.శ. 64
కొలొస్సయిలో ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలకు, క్రీస్తులో విశ్వాసులైన సహోదరీ సహోదరులకు,
- కొలొస్సయులకు 1:3సుమారు క్రీ.శ. 64
క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
- కొలొస్సయులకు 1:4సుమారు క్రీ.శ. 64
Since we heard of your faith in Christ Jesus, and of the love which ye have to all the saints,
- కొలొస్సయులకు 1:5సుమారు క్రీ.శ. 64
మీ దగ్గరకు వచ్చిన సువార్త అనే సత్య బోధలో మీరు విన్న, పరలోకంలో మీ కోసం దాచి ఉంచిన నిరీక్షణ నుండి విశ్వాసం ప్రేమ కలిగాయి.
- కొలొస్సయులకు 1:6సుమారు క్రీ.శ. 64
అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది.
- కొలొస్సయులకు 1:7సుమారు క్రీ.శ. 64
మా ప్రియ తోటి సేవకుడైన ఎపఫ్రా నుండి వీటిని మీరు నేర్చుకున్నారు, అతడు మా విషయంలో క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు.
- కొలొస్సయులకు 1:8సుమారు క్రీ.శ. 64
ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు.
- కొలొస్సయులకు 1:9సుమారు క్రీ.శ. 64
ఈ కారణంగా, మీ గురించి విన్న రోజు నుండి, మేము మీ కోసం మానక ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మ ఇచ్చే సంపూర్ణ జ్ఞానం, వివేకం ద్వారా ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారై,
- కొలొస్సయులకు 1:10సుమారు క్రీ.శ. 64
ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,
- కొలొస్సయులకు 1:11సుమారు క్రీ.శ. 64
మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.
- కొలొస్సయులకు 1:12సుమారు క్రీ.శ. 64
వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
- కొలొస్సయులకు 1:13సుమారు క్రీ.శ. 64
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు.
- కొలొస్సయులకు 1:14సుమారు క్రీ.శ. 64
ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది.
- కొలొస్సయులకు 1:15సుమారు క్రీ.శ. 64
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు.