circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఫిలిప్పీయులకు 2:15సుమారు క్రీ.శ. 64
తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.
- ఫిలిప్పీయులకు 2:16సుమారు క్రీ.శ. 64
Holding forth the word of life; that I may rejoice in the day of Christ, that I have not run in vain, neither laboured in vain.
- ఫిలిప్పీయులకు 2:17సుమారు క్రీ.శ. 64
మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.
- ఫిలిప్పీయులకు 2:18సుమారు క్రీ.శ. 64
కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.
- ఫిలిప్పీయులకు 2:19సుమారు క్రీ.శ. 64
మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను.
- ఫిలిప్పీయులకు 2:20సుమారు క్రీ.శ. 64
అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు.
- ఫిలిప్పీయులకు 2:21సుమారు క్రీ.శ. 64
ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు.
- ఫిలిప్పీయులకు 2:22సుమారు క్రీ.శ. 64
తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు.
- ఫిలిప్పీయులకు 2:23సుమారు క్రీ.శ. 64
కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను.
- ఫిలిప్పీయులకు 2:24సుమారు క్రీ.శ. 64
నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
- ఫిలిప్పీయులకు 2:25సుమారు క్రీ.శ. 64
నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
- ఫిలిప్పీయులకు 2:26సుమారు క్రీ.శ. 64
అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు.
- ఫిలిప్పీయులకు 2:27సుమారు క్రీ.శ. 64
అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు.
- ఫిలిప్పీయులకు 2:28సుమారు క్రీ.శ. 64
మీరు అతన్ని మరలా చూసినప్పుడు మీరు సంతోషిస్తారు, అలాగే నా వేదన కొంత తగ్గుతుంది, కాబట్టి అతన్ని పంపాలని అందరికంటే నేనే ఎక్కువ ఆశపడుతున్నాను.
- ఫిలిప్పీయులకు 2:29సుమారు క్రీ.శ. 64
గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి.
- ఫిలిప్పీయులకు 2:30సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే క్రీస్తు పని కోసం అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు నాకు చేయలేని సహాయాన్ని చేయడానికి అతడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు.
- ఫిలిప్పీయులకు 3:1సుమారు క్రీ.శ. 64
చివరిగా, నా సహోదరీ సహోదరులారా, ప్రభువులో ఆనందించండి! మరల అవే సంగతులను మీకు వ్రాయడం నాకు కష్టం కలిగించదు, అది మీకు రక్షణ కవచము.
- ఫిలిప్పీయులకు 3:2సుమారు క్రీ.శ. 64
ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త.
- ఫిలిప్పీయులకు 3:3సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.
- ఫిలిప్పీయులకు 3:4సుమారు క్రీ.శ. 64
కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి.
- ఫిలిప్పీయులకు 3:5సుమారు క్రీ.శ. 64
నేను ఎనిమిదవ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశానికి చెందినవాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను; ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను.
- ఫిలిప్పీయులకు 3:6సుమారు క్రీ.శ. 64
అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని నీతి విషయంలో నిరపరాధిని.
- ఫిలిప్పీయులకు 3:7సుమారు క్రీ.శ. 64
అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను.
- ఫిలిప్పీయులకు 3:8సుమారు క్రీ.శ. 64
నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కాబట్టి నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను.
- ఫిలిప్పీయులకు 3:9సుమారు క్రీ.శ. 64
క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,