circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఫిలిప్పీయులకు 1:20సుమారు క్రీ.శ. 64
నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను.
- ఫిలిప్పీయులకు 1:21సుమారు క్రీ.శ. 64
నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.
- ఫిలిప్పీయులకు 1:22సుమారు క్రీ.శ. 64
ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు!
- ఫిలిప్పీయులకు 1:23సుమారు క్రీ.శ. 64
ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.
- ఫిలిప్పీయులకు 1:24సుమారు క్రీ.శ. 64
అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము.
- ఫిలిప్పీయులకు 1:25సుమారు క్రీ.శ. 64
మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు.
- ఫిలిప్పీయులకు 1:26సుమారు క్రీ.శ. 64
ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది.
- ఫిలిప్పీయులకు 1:27సుమారు క్రీ.శ. 64
ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన.
- ఫిలిప్పీయులకు 1:28సుమారు క్రీ.శ. 64
And in nothing terrified by your adversaries: which is to them an evident token of perdition, but to you of salvation, and that of God.
- ఫిలిప్పీయులకు 1:29సుమారు క్రీ.శ. 64
మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది,
- ఫిలిప్పీయులకు 1:30సుమారు క్రీ.శ. 64
నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.
- ఫిలిప్పీయులకు 2:1సుమారు క్రీ.శ. 64
అయితే మీకు క్రీస్తులో ప్రోత్సాహం గాని, ఆయన ప్రేమ వలన ఆదరణ గాని, ఆత్మలో ఏ సహవాసం గాని, దయ, కనికరం గాని కలిగినచో,
- ఫిలిప్పీయులకు 2:2సుమారు క్రీ.శ. 64
మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి.
- ఫిలిప్పీయులకు 2:3సుమారు క్రీ.శ. 64
స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ,
- ఫిలిప్పీయులకు 2:4సుమారు క్రీ.శ. 64
మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
- ఫిలిప్పీయులకు 2:5సుమారు క్రీ.శ. 64
మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
- ఫిలిప్పీయులకు 2:6సుమారు క్రీ.శ. 64
ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
- ఫిలిప్పీయులకు 2:7సుమారు క్రీ.శ. 64
కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.
- ఫిలిప్పీయులకు 2:8సుమారు క్రీ.శ. 64
మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!
- ఫిలిప్పీయులకు 2:9సుమారు క్రీ.శ. 64
అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
- ఫిలిప్పీయులకు 2:10సుమారు క్రీ.శ. 64
యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
- ఫిలిప్పీయులకు 2:11సుమారు క్రీ.శ. 64
ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.
- ఫిలిప్పీయులకు 2:12సుమారు క్రీ.శ. 64
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి.
- ఫిలిప్పీయులకు 2:13సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.
- ఫిలిప్పీయులకు 2:14సుమారు క్రీ.శ. 64
సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి.