కంటెంట్‌కు వెళ్లండి

Gilead

80 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gileadites

32.0400, 35.7200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gilead ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.

  2. గాదు గోత్రం నుండి: గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము,

  3. కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయులను కనానులోని షిలోహులో విడిచిపెట్టి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తమ సొంత దేశమైన గిలాదుకు తిరిగి వచ్చారు.

  4. కాబట్టి ఇశ్రాయేలీయులు యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును గిలాదు దేశంలో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రాల వారి దగ్గరకు పంపారు.

  5. గిలాదులో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అన్నారు:

  6. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, నాయకులు గిలాదులోని రూబేనీయులు, గాదీయులను కలిసి కనానుకు తిరిగివచ్చి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని చెప్పారు.

  7. గిలాదువారు యొర్దాను అవతల నివసించారు. దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఉన్నారు.

  8. అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు పట్టణాలు అని పిలుస్తారు.

  9. వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు.

  10. ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు.

  11. గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు.

  12. And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob:

  13. యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”

  14. గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.

  15. యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.

  16. అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

  17. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.

  18. తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

  19. యెఫ్తా గిలాదు మనుష్యులను కూర్చుకుని ఎఫ్రాయిం వారితో యుద్ధం చేశాడు. ఎఫ్రాయిమీయులను, “గిలాదీయులైన మీరు ఎఫ్రాయిం మనష్షేల ఎదుట నిలబడలేక పారిపోయారు” అని అన్నారు.

  20. కాబట్టి గిలాదీయులు ఎఫ్రాయిం ఎదురుగా ఉన్న యొర్దాను రేవును ఆక్రమించారు, ఎఫ్రాయిం వారిలో పారిపోతున్న వారెవరైనా వచ్చి, “నన్ను దాటి వెళ్లనివ్వండి” అని అంటే, గిలాదు మనుష్యులు, “నీవు ఎఫ్రాయిం వాడవా?” అని అడిగేవారు. అతడు, “కాదు” అని అంటే,

  21. యెఫ్తా ఆరేళ్ళు ఇశ్రాయేలును నడిపించాడు. తర్వాత గిలాదీయుడైన యెఫ్తా చనిపోయాడు, గిలాదులో ఒక పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

  22. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.

  23. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి గిలాదు దేశానికి వెళ్లిపోయారు. సౌలు ఇంకా గిల్గాలులో ఉన్నాడు; అతనితో ఉన్న దళాలు అన్ని భయంతో వణుకుతూ ఉన్నాయి.

  24. అతన్ని గిలాదు, అషూరీ, యెజ్రెయేలు, ఎఫ్రాయిం బెన్యామీను, ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా చేశాడు.

  25. అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు ప్రాంతంలో శిబిరం ఏర్పరచుకున్నారు.