కంటెంట్‌కు వెళ్లండి

Gilead

80 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gileadites

32.0400, 35.7200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gilead ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.

  2. రామోత్ గిలాదుకు బెన్-గెబెరు అధికారి; (ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు ప్రాంతం, దాని యొక్క పెద్ద ప్రాకారాలు ఇత్తడి ద్వారబంధాలు కలిగిన అరవై పట్టణాలు అప్పగించబడ్డాయి);

  3. గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి.

  4. గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”

  5. From Jordan eastward, all the land of Gilead, the Gadites, and the Reubenites, and the Manassites, from Aroer, which is by the river Arnon, even Gilead and Bashan.

  6. అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

  7. ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.

  8. సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.

  9. వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.

  10. సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.

  11. గాదు వంశస్థులు బాషానులో గిలాదులో, చుట్టుప్రక్కల గ్రామాల్లో, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని మైదానాల్లో నివసించారు.

  12. గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము,

  13. హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది.

  14. గిలాదులోని మనష్షే అర్థగోత్రం మీద: జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీనీయుల మీద: అబ్నేరు కుమారుడైన యయశీయేలు;

  15. గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.

  16. గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.

  17. నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి.

  18. నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; అవి నన్ను వశపరచుకుంటాయి. నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.

  19. గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?

  20. ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.

  21. “కన్యయైన ఈజిప్టు కుమారీ, గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; నీకు స్వస్థత కలుగదు.

  22. అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”

  23. తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది.

  24. గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.

  25. గిలాదు చెడ్డదా? దాని ప్రజలు వ్యర్థమైన వారు! వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని రాళ్ల కుప్పల్లా ఉన్నాయి.