కంటెంట్‌కు వెళ్లండి

Gilead

80 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gileadites

32.0400, 35.7200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gilead ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.

  2. యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.

  3. దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు.

  4. మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.

  5. నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు.