కంటెంట్‌కు వెళ్లండి

Jephthah గురించి బైబిల్ వచనాలు

21 వచనాలు · 12 కోణాలు

"Jephthah" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. గిలాదు వంశానికి చెందిన యెఫ్తా బలమైన యోధుడు. యెఫ్తా తండ్రి గిలాదు; అతని తల్లి ఓ వేశ్య.

  2. గిలాదుకు అతని భార్య కుమారులను కన్నది, వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాను తరిమేశారు. “నీవు ఇతర స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి మా కుటుంబంలో నీకు ఆస్తి వాటా రాదు” అని వారు అతనితో అన్నారు.

  3. And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob:

  4. యెఫ్తాతో వారు, “రా, వచ్చి మా దళాధిపతిగా ఉండు, అప్పుడు మేము అమ్మోనీయులతో పోరాడగలం” అన్నారు.

  5. యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”

  6. గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.

  7. యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.

  8. అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

  9. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.

  10. తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.

  11. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే,

  12. నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”

  13. తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు.

  14. అతడు అరోయేరు నుండి మిన్నీతు వరకు, అలా ఆబేల్-కెరామీము వరకు ఇరవై పట్టణాలను నాశనం చేశాడు. ఇలా ఇశ్రాయేలు అమ్మోనును లోబరచుకుంది.

  15. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.

  16. అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.

  17. ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు.

  18. అయితే ఈ ఒక్క కోరిక తీర్చు. నేను ఇక పెళ్ళి చేసుకోను, కాబట్టి రెండు నెలలు నా స్నేహితులతో కొండల్లో సంచరిస్తూ ప్రలాపించనివ్వు.”

  19. అందుకతడు, “నీవు వెళ్లవచ్చు” అని ఆమెతో అన్నాడు. రెండు నెలల వరకు అతడు ఆమెను వెళ్లనిచ్చాడు. ఆమె తన స్నేహితులతో కొండల్లోకి వెళ్లి తాను ఇక పెళ్ళి చేసుకోలేదని ప్రలాపించింది.

  20. ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది. దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే

  21. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యువతులు నాలుగు రోజులపాటు బయటకు వెళ్లి, గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు.