కంటెంట్‌కు వెళ్లండి

Water గురించి బైబిల్ వచనాలు

197 వచనాలు · 84 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, “అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!” అని కేక పెట్టాడు.

  2. దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది.

  3. హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు సాధించినవన్నీ, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీటిని పట్టణానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  4. అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు.

  5. అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది.

  6. బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా?

  7. నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.

  8. నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.

  9. సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి, ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా, నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు.

  10. “అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; వారి భూభాగం శపించబడింది, కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు.

  11. ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.

  12. దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.

  13. ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు?

  14. నేను నీటిలా పారబోయబడ్డాను, నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి. నా హృదయం మైనంలా; నాలో కరిగిపోయింది.

  15. పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.

  16. ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక; వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.

  17. మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు; అగ్ని జలాల గుండా మేము వెళ్లాము, అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు.

  18. సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.

  19. ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.

  20. అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి; అవి నన్ను పూర్తిగా ముంచేశాయి.

  21. అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.

  22. అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.

  23. Then the waters had overwhelmed us, the stream had gone over our soul:

  24. Then the proud waters had gone over our soul.

  25. ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.