Water గురించి బైబిల్ వచనాలు: Purified by Elisha
Purified by Elisha గురించి వచనాలు
పట్టణ వాసులు ఎలీషాతో, “చూడండి, మా ప్రభువా, ఈ పట్టణం మంచి స్థలంలో ఉంది, కాని నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారంగా ఉంది” అన్నారు.
అతడు, “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. వారు దానిని అతని దగ్గరకు తెచ్చారు.
అప్పుడు అతడు ఊట దగ్గరకు వెళ్లి అందులో ఆ ఉప్పు వేసి, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక మీద ఇది చావును తీసుకురాదు; భూమిని నిస్సారంగా చేయదు” అని అన్నాడు.
ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఈ రోజు వరకు ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంది.