కంటెంట్‌కు వెళ్లండి

Water గురించి బైబిల్ వచనాలు: The want of, considered a great calamity

7 వచనాలు · 84 కోణాలు

The want of, considered a great calamity గురించి వచనాలు

  1. ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించారు. వారు రెఫీదీములో బస చేశారు, కాని అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.

  2. కాబట్టి వారు మోషేతో గొడవపడుతూ, “మాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వు” అని అడిగారు. అందుకు మోషే, “నాతో ఎందుకు గొడవపడుతున్నారు? యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” అన్నాడు.

  3. కాని అక్కడ ప్రజలు దాహం తట్టుకోలేక మోషే మీద సణుగుతూ, “మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకువచ్చారు? దాహంతో మేము మా పిల్లలు మా పశువులు చావాలనా?” అన్నారు.

  4. అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు.

  5. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు.

  6. ఇశ్రాయేలు రాజైన యోరాము ఆతురతతో, “అయ్యో! యెహోవా మోయాబుకు అప్పగించడానికి మన ముగ్గురు రాజులను పిలిచారా?” అని అన్నాడు.

  7. చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,