Water గురించి బైబిల్ వచనాలు: Brooks
Brooks గురించి వచనాలు
తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు. అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.