Skip to content

Solomon గురించి బైబిల్ వచనాలు

301 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.

  2. సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును అనుసరించాడు.

  3. కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు.

  4. సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు.

  5. తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు.

  6. సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించక, తన హృదయం త్రిప్పుకున్నందుకు యెహోవా అతని మీద చాలా కోప్పడ్డారు.

  7. ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు.

  8. కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, “నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను.

  9. అయినాసరే, నీ తండ్రియైన దావీదును బట్టి, నీ జీవితకాలంలో అలా చేయను, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను.

  10. అయితే అతని నుండి రాజ్యాన్నంతా తీసివేయను కాని నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎన్నుకున్న యెరూషలేమును బట్టి, నేను నీ కుమారునికి ఒక్క గోత్రం ఇస్తాను.”

  11. “మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు. అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”

  12. గతంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెరూషలేముకు ఎదురుగా ఉన్న అవినీతి పర్వతానికి దక్షిణం వైపు సీదోనీయుల హేయ దేవత అష్తారోతుకు, మోయాబీయుల హేయ దేవుడైన కెమోషుకు, అమ్మోనీయుల హేయ దేవుడైన మిల్కోముకు కట్టించిన క్షేత్రాలను అపవిత్రం చేశాడు.

  13. యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.

  14. నీ దినాలు ముగిసి నీ పూర్వికుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తుతాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

  15. నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.

  16. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. నీకంటే ముందున్న వానికి నేను నా ప్రేమను దూరం చేసినట్లుగా అతనికి ఎప్పుడూ దూరం చేయను.

  17. నా ఇంటి మీద, నా రాజ్యం మీద నేను అతన్ని నిత్యం స్థిరపరుస్తాను; అతని సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”

  18. దావీదు వృద్ధుడై వయస్సు నిండినవాడై ఉన్నప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు.

  19. ఆయన నాతో ఇలా అన్నారు: ‘నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఎన్నుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను కాబట్టి అతడు నా మందిరాన్ని, ఆవరణాలను కట్టిస్తాడు.

  20. ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగానే, అతడు నా ఆజ్ఞలను న్యాయాన్ని స్థిరంగా అనుసరిస్తే, నేనతని రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’

  21. ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.

  22. అధిపతులందరు, యుద్ధ వీరులందరు, రాజైన దావీదు కుమారులందరు, సొలొమోను రాజుకు విధేయత చూపించారు.

  23. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట ఎంతో ఉన్నతంగా చేసి, అతనికి ముందున్న ఇశ్రాయేలీయుల రాజులలో ఏ రాజుకు కలగని రాజ వైభవాన్ని అతనికి ప్రసాదించారు.

  24. ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.

  25. అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు.