Skip to content

Sheep గురించి బైబిల్ వచనాలు

144 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు.

  2. నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.

  3. అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.

  4. అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.

  5. “కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.

  6. రెండు సంవత్సరాల తర్వాత, అబ్షాలోము యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించేవారు ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్-హసోరులో ఉన్నప్పుడు, అతడు రాజకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు.

  7. తేనె, పెరుగు, గొర్రెలు, ఆవు పాల జున్ను దావీదు, అతనితో ఉన్న ప్రజల కోసం తెచ్చారు. ఎందుకంటే, “అరణ్యంలో ప్రజలు అలసిపోయి, ఆకలితో దాహంతో ఉన్నారు” అని వారు గ్రహించారు.

  8. నాశనం చేస్తున్న దూతను చూసిన దావీదు, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.

  9. అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.

  10. పది దొడ్లలో మేపే పశువులు, ఇరవై పచ్చికల్లో మేసే పశువులు, వంద గొర్రెలు, మేకలు, అంతేకాక జింకలు దుప్పులు, లేళ్ళు, క్రొవ్విన బాతులు.

  11. రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.

  12. సొలొమోను యెహోవాకు సమాధానబలులుగా 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులందరు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.

  13. మోయాబు రాజైన మేషాకు చాలా గొర్రెలు ఉండేవి. అతడు ఇశ్రాయేలు రాజుకు లక్ష గొర్రెపిల్లలను, లక్ష పొట్టేళ్ళ ఉన్నిని పన్నుగా చెల్లిస్తూ వచ్చాడు.

  14. వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.

  15. ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.

  16. వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  17. ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు.

  18. యాజకులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసియున్న సేవ శ్రద్ధగా జరిగించేటట్టు, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని రాజు యెరూషలేము నగరవాసులను ఆదేశించాడు.

  19. అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.

  20. యూదా పట్టణాల్లో కాపురం ఉంటున్న యూదా వారు, ఇశ్రాయేలీయులు తమ పశువుల మందలో నుండి, గొర్రెల, మేకలమందలలో నుండి పదవ భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులలో నుండి కూడా పదవ భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు.

  21. ప్రతిరోజు ఒక ఎద్దు, ఆరు ఎంపిక చేసిన గొర్రెలు, కొన్ని కోళ్లు నా కోసం సిద్ధం చేసేవారు, పదిరోజులకు ఒకసారి అనేక రకాల ద్రాక్షరసాలను సమృద్ధిగా అందించేవారు. ఈ ప్రకారం చేసినా ప్రజల పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కాకుండా అధిపతికి ఇచ్చే ఆహారాన్ని నేను ఆశించలేదు.

  22. “అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నాకన్నా చిన్నవారు, ఎవరి తండ్రులను నేను నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.

  23. నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,

  24. పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.

  25. సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు.