Sheep గురించి బైబిల్ వచనాలు: Taken in great numbers in war
Taken in great numbers in war గురించి వచనాలు
వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు.
ప్రజలు దోపుడుసొమ్ము మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను దూడలను తీసుకుని నేల మీద పడవేసి వధించి రక్తంతో కలిపి తిన్నారు.
వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.
వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.