Sheep గురించి బైబిల్ వచనాలు: Fed on the mountains
Fed on the mountains గురించి వచనాలు
ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు.
నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.
నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.