Sheep గురించి బైబిల్ వచనాలు: Watered every day
Watered every day గురించి వచనాలు
“మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు.
యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి.
యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.
మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు.
కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి వారిని తరిమివేశారు, అయితే మోషే లేచి వారిని రక్షించి వారి మందకు నీళ్లు పెట్టాడు.