Sheep గురించి బైబిల్ వచనాలు: Of the Jews
Of the Jews గురించి వచనాలు
ఆసాపు ధ్యానకీర్తన. దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?
అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.
అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము, మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము; తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.