Skip to content

Timnah

8 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Timnath

31.7800, 34.9000 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Timnah ను ప్రస్తావించే వచనాలు

  1. చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు.

  2. “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు,

  3. తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.

  4. తర్వాత ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు పర్వతానికి వంపుగా తిరిగి, యారీము పర్వతం (అంటే కెసాలోను) ఉత్తర వాలు గుండా వెళ్లింది, బేత్-షెమెషు వరకు కొనసాగి తిమ్నాకు వ్యాపించింది.

  5. సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.

  6. అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి” అని అన్నాడు.

  7. సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది.

  8. ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.