Sheep గురించి బైబిల్ వచనాలు: Flesh of, extensively used as food
Flesh of, extensively used as food గురించి వచనాలు
అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.
అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.
పది దొడ్లలో మేపే పశువులు, ఇరవై పచ్చికల్లో మేసే పశువులు, వంద గొర్రెలు, మేకలు, అంతేకాక జింకలు దుప్పులు, లేళ్ళు, క్రొవ్విన బాతులు.
ప్రతిరోజు ఒక ఎద్దు, ఆరు ఎంపిక చేసిన గొర్రెలు, కొన్ని కోళ్లు నా కోసం సిద్ధం చేసేవారు, పదిరోజులకు ఒకసారి అనేక రకాల ద్రాక్షరసాలను సమృద్ధిగా అందించేవారు. ఈ ప్రకారం చేసినా ప్రజల పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కాకుండా అధిపతికి ఇచ్చే ఆహారాన్ని నేను ఆశించలేదు.
కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి మనం తిని త్రాగుదాం” అని చెప్పి, పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, మీరు సంతోషించి ఉల్లసిస్తారు.