Skip to content

Sheep గురించి బైబిల్ వచనాలు

144 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు.

  2. అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు.

  3. అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి.

  4. అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.

  5. అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు.

  6. “మీరు బసచేయడానికి కావలసిన స్థలం, మీ ఒంటెలకు మేత కూడా మా ఇంట్లో ఉంది” అని కూడా చెప్పింది.

  7. అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు.

  8. “మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు.

  9. యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి.

  10. యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.

  11. ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు.

  12. నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.

  13. లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.

  14. ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు.

  15. అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.

  16. అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.

  17. తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి.

  18. అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి.

  19. యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు.

  20. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది.

  21. చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు.

  22. “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు,

  23. తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.

  24. యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.

  25. ఆమె తన కోడలని తెలియక, దారిలో ఉన్న ఆమె వైపు వెళ్లి, “రా, నేను నీతో పడుకుంటాను” అని అన్నాడు. “నాతో పడుకోడానికి నాకు ఏమి ఇస్తావు?” అని ఆమె అడిగింది.