కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.

  2. యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

  3. మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.

  4. మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.

  5. యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.

  6. సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

  7. మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  8. యాత్రకీర్తన. “నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి;

  9. “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.

  10. దున్నువారు దున్నినట్లు నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.

  11. అయితే యెహోవా నీతిమంతుడు; దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”

  12. సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.

  13. వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.

  14. దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.

  15. “యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక.

  16. యాత్రకీర్తన. యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;

  17. ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.

  18. యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?

  19. కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.

  20. యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.

  21. కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.

  22. ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.

  23. ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.

  24. దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.

  25. పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.