Psalms గురించి బైబిల్ వచనాలు: Prophetic Psalms
Prophetic Psalms గురించి వచనాలు
దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,
“మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.
ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,
“నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”
నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.
నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”
కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.
దావీదు శ్రేష్ఠమైన కీర్తన. నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.
యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.
భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”
వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి. వారి రక్తార్పణలలో నేను పాల్గొనను నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.
యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.
మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి; ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.
నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.
ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది.
ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.
కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము. యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.
యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.