కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు: Psalms of Affliction

315 వచనాలు · 16 కోణాలు

Psalms of Affliction గురించి వచనాలు

  1. దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!

  2. “దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా

  3. కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.

  4. నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా

  5. నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.

  6. అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

  7. యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.

  8. రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా

  9. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.

  10. ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా

  11. యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.

  12. వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా

  13. నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి.

  14. యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” అని అనేకులు అడుగుతున్నారు మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.

  15. ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.

  16. నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.

  17. సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.

  18. నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.

  19. యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.

  20. మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు; చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.

  21. అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు; చెడు చేసేవారందరిని మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని

  22. మీరు నాశనం చేస్తారు. రక్తపిపాసులను మోసగాండ్రను, యెహోవా అసహ్యించుకుంటారు.

  23. కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.

  24. యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.

  25. వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు. వారి హృదయం అసూయతో నిండి ఉంది. వారి గొంతు తెరిచిన సమాధి; వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.