- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Psalms గురించి బైబిల్ వచనాలు: Didactic Psalms
Didactic Psalms గురించి వచనాలు
దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక,
యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.
వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.
అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.
కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.
నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.
సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.
నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.
యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.
మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు; చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.
అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు; చెడు చేసేవారందరిని మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని
మీరు నాశనం చేస్తారు. రక్తపిపాసులను మోసగాండ్రను, యెహోవా అసహ్యించుకుంటారు.
కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.
యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.
వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు. వారి హృదయం అసూయతో నిండి ఉంది. వారి గొంతు తెరిచిన సమాధి; వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.
ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, మీరు వారిని కాపాడండి.
యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు; డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.
సంగీత దర్శకునికి.దావీదు కీర్తన. నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో.
దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు, చీకటిలో పొంచి ఉండి యథార్థ హృదయుల పైకి వేయడానికి బాణాలు సిద్ధం చేస్తున్నారు.
పునాదులు నాశనమై పోతుంటే, నీతిమంతులు ఏం చేయగలరు?” అని నాతో మీరెలా అంటారు?
యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు.
దుష్టుల మీద ఆయన నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు; వడగాలి వారి భాగం అవుతుంది.
యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.