- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Psalms గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.
సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
దావీదు యాత్రకీర్తన. “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.
ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో మా పాదాలు నిలిచి ఉన్నాయి.
యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది.
ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రాలు అనగా యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.
అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.
యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!
మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”
నా సోదరులు నా స్నేహితుల కోసం “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.
మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను.
యాత్రకీర్తన. పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.
యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులను ఉపయోగిస్తారు.
యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
సొలొమోను యాత్రకీర్తన. యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.
పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు.