కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,

  2. అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?

  3. దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;

  4. ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.

  5. అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.

  6. ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,

  7. యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.

  8. అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది;

  9. పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి.

  10. సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు?

  11. పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు?

  12. ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.

  13. ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.

  14. యాత్రకీర్తన. నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.

  15. యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి.

  16. ఓ మోసకరమైన నాలుకా, దేవుడు నీకేం చేస్తారు? ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?

  17. వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.

  18. నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!

  19. సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.

  20. నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

  21. యాత్రకీర్తన. కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?

  22. ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.

  23. ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.

  24. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు.

  25. యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.