కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు.

  2. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

  3. యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.

  4. అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా

  5. నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.

  6. ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.

  7. యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా

  8. నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.

  9. మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; వారు అగ్నిలో పడవేయబడాలి, తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.

  10. దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.

  11. యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.

  12. నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.

  13. దావీదు కీర్తన. యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి.

  14. నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.

  15. యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.

  16. కీడు చేసేవారితో కలిసి వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!

  17. నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.

  18. వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.

  19. “ఒకరు భూమిలో దున్నినట్లు, మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.

  20. ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.

  21. కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.

  22. దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను.

  23. దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.

  24. ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.

  25. నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.