కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి

  2. నన్ను విడిపించండి; విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.

  3. అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా, తమ యవ్వన దశలో ఉంటారు. మా కుమార్తెలు, రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు.

  4. మా కొట్లు అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి. మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి.

  5. మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. గోడలు నాశనం కాకూడదు. చెరలోనికి వెళ్లకూడదు దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు.

  6. ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.

  7. యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.

  8. యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.

  9. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.

  10. ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి.

  11. అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,

  12. ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.

  13. భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, సమస్త సముద్రపు అగాధాల్లారా,

  14. మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు,

  15. పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా, ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా,

  16. మృగాలు, సమస్త పశువులారా, నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా,

  17. భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, రాకుమారులారా, పాలకులారా,

  18. యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి.

  19. వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.

  20. ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.

  21. యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.

  22. ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

  23. బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.

  24. కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.

  25. తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, ఆయనను స్తుతించండి.