కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.

  2. యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; “నా ఆశ్రయం మీరే, సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను.

  3. నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.

  4. నేను మీ నామాన్ని స్తుతించేలా, చెరసాలలో నుండి నన్ను విడిపించండి. అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.

  5. దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.

  6. మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.

  7. శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; ఎప్పుడో చచ్చిన వారిలా అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.

  8. నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; నా హృదయం నాలో బెదిరిపోయింది.

  9. వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.

  10. మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా

  11. యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.

  12. నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.

  13. నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.

  14. మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.

  15. యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.

  16. మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; నేను మీ సేవకుని కాబట్టి, నా శత్రువులను నాశనం చేయండి.

  17. దావీదు కీర్తన. నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.

  18. ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము.

  19. యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?

  20. నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి.

  21. యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి.

  22. మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి.

  23. పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి.

  24. వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.

  25. నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.