Skip to content

Prophecy గురించి బైబిల్ వచనాలు

120 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు, పట్టణం బయటకు వెళ్లారు, సైన్యం వారి వెనుక వెళ్లింది.

  2. ప్రతి ఒకడు తన ప్రత్యర్థిని కూలగొట్టాడు. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు తరుముతూ ఉంటే, అరామీయులు పారిపోయారు. అరాము రాజైన బెన్-హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకున్నాడు.

  3. అప్పుడు ఇశ్రాయేలు రాజు నగరం నుండి వెళ్లి గుర్రాలను, రథాలను స్వాధీనం చేసుకుని, అరామీయులను చాలామందిని హతం చేశాడు.

  4. తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”

  5. ఇంతలో అరాము రాజు పరివారం అతనితో, “ఇశ్రాయేలు దేవుళ్ళు కొండల దేవుళ్ళు. అందుకే వారు మనకంటే బలంగా ఉన్నారు. కాని మనం సమతల మైదాన ప్రాంతంలో వారితో పోరాడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము.

  6. ఇలా చేయండి: రాజులందరినీ తొలగించి వారికి బదులు అధిపతులను నియమించండి.

  7. మీరు పోగొట్టుకున్న సైన్యంలాంటి మరో సైన్యాన్ని సమకూర్చండి అంటే గుర్రానికి గుర్రం, రథానికి రథం. తద్వారా ఇశ్రాయేలుతో మైదాన ప్రాంతంలో యుద్ధం చేయవచ్చు. అప్పుడు మనం వారిపై గెలుస్తాం” అని చెప్పారు. అతడు వారి సలహా అంగీకరించి అల చేశాడు.

  8. మరుసటి వసంతకాలంలో, బెన్-హదదు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అరాము సైన్యాన్ని పోగుచేసి, ఆఫెకు ప్రాంతానికి వెళ్లాడు.

  9. ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.

  10. దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”

  11. వారు ఏడు రోజులు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఉన్నారు, ఏడవ రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇశ్రాయేలీయులు అరాము కాల్బలంలో లక్ష మందికి ప్రాణనష్టం కలిగించారు.

  12. మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.

  13. తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”

  14. మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరున అతనితో మాట్లాడిన దీర్ఘదర్శి మాటలు, అవన్నీ ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

  15. వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.

  16. మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు.

  17. ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.

  18. సర్వ దేశాలు గుమికూడాలి జనములు సమావేశమవ్వాలి. వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు? తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి, అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు.

  19. నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, ఇంకా ఏమి జరగబోతుందో అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి.

  20. నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.

  21. నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.

  22. “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.

  23. మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.

  24. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.

  25. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు.