Tekoa
ఇలా కూడా పిలుస్తారు: Tekoah
31.6300, 35.2100 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Tekoa ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు.
ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.
అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.
బేత్లెహేము, ఏతాము, తెకోవా,
తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”
“బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.
యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.