Prophecy గురించి బైబిల్ వచనాలు: Christ the great subject of
Christ the great subject of గురించి వచనాలు
అందుకే మోషే, ‘మీ దేవుడైన ప్రభువు నా లాంటి ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, ఆయన మీతో చెప్పేవాటన్నిటిని మీరు ఖచ్చితంగా వినాలి.
ఎవరైనా ప్రవక్త చెప్పే మాటలకు స్పందించకపోతే వారు తమ ప్రజల నుండి పూర్తిగా తొలగించబడాలి’ అని చెప్పాడు.
“నిజానికి సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరు ఈ రోజుల గురించి ముందే ప్రవచించారు.
ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”
మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా చాలా జాగ్రత్తగా విచారించి పరిశోధించారు.
క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు.