కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు

580 వచనాలు · 175 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్లడానికి తర్షీషు ఓడలను నిర్మించాడు కాని అవి సముద్రయానం చేయకుండానే ఎసోన్-గెబెరు దగ్గర బద్దలైపోయాయి.

  2. అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.

  3. తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన తండ్రి దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.

  4. యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  5. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల విధానాలను ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జీవిత విధానాలను అనుసరించాడు.

  6. అతడు బయలును సేవిస్తూ పూజిస్తూ, తన తండ్రిలా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

  7. అహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యోరాము పరిపాలనలోని అయిదవ సంవత్సరంలో, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదాలో రాజయ్యాడు.

  8. అతడు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

  9. అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

  10. అయితే, యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.

  11. యెహోరాము కాలంలో ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.

  12. కాబట్టి యెహోరాము తన రథాలన్నిటితో జాయీరుకు వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు; అతని సైన్యం తమ గుడారాలకు పారిపోయారు.

  13. ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది.

  14. యెహోరాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  15. యెహోరాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో వారి దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహజ్యా రాజయ్యాడు.

  16. ఇశ్రాయేలు రాజు, అహాబు కుమారుడైన యోరాము పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో యూదారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.

  17. అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా, ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ మనుమరాలు.

  18. అహజ్యా అహాబు ఇంటి అల్లుడు కాబట్టి అతడు అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించి అహాబు కుటుంబంలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

  19. అహజ్యా అహాబు కుమారుడైన యోరాముతో కలిసి, అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లగా అరామీయులు యోరామును గాయపరిచారు.

  20. కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.

  21. అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.

  22. యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.

  23. ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” “సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.” కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.

  24. కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు. అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.

  25. కావలివాడు, “అతడు వారిని చేరుకున్నాడు, కాని అతడు కూడా తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడవడం నిమ్షీ మనుమడు యెహు నడిచినట్లు ఉంది, వెర్రిపట్టినవానిలా తోలుతున్నాడు” అని తెలియజేశాడు.