కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.

  2. ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?

  3. దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,

  4. మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!

  5. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.

  6. వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’

  7. “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.

  8. పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.

  9. ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.

  10. ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!

  11. నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.

  12. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను.

  13. మరొకరు కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!

  14. నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.

  15. అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

  16. యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.

  17. కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.

  18. నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; మీ ముందు వారు తడబడి నశిస్తారు.

  19. నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు.

  20. అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.

  21. మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.

  22. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.

  23. యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.

  24. సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

  25. యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.