కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు: General references

147 వచనాలు · 124 కోణాలు

"Faith" కోసం వెతకండి

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.

  2. మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.

  3. కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.

  4. ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.

  5. అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన. నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.

  6. నేను యెహోవాలో అతిశయిస్తాను. బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!

  7. నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.

  8. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.

  9. ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.

  10. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.

  11. యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.

  12. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.

  13. ఆయన యాకోబుకు చట్టాలు విధించారు ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, వారి పిల్లలకు దానిని బోధించుమని మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.

  14. తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, వారు వారి పిల్లలకు బోధిస్తారు.

  15. అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు ఆయన కార్యాలను మరచిపోరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.

  16. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

  17. వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.

  18. మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  19. రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  20. “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.

  21. వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”

  22. అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

  23. మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు.

  24. అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు.

  25. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు.