కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.

  2. మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.

  3. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.

  4. యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.

  5. అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన. నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.

  6. నేను యెహోవాలో అతిశయిస్తాను. బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!

  7. నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.

  8. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.

  9. ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.

  10. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.

  11. యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.

  12. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.

  13. నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట.

  14. యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.

  15. మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.

  16. గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.

  17. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

  18. నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  19. సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము. దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం

  20. కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.

  21. జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా

  22. ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు.

  23. మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా

  24. నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు.

  25. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు.