కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; మీరు నా కుడిచేయి పట్టుకున్నారు.

  2. మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.

  3. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.

  4. యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  5. మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”

  6. ఆయన యాకోబుకు చట్టాలు విధించారు ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, వారి పిల్లలకు దానిని బోధించుమని మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.

  7. తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, వారు వారి పిల్లలకు బోధిస్తారు.

  8. అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు ఆయన కార్యాలను మరచిపోరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.

  9. మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.

  10. యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”

  11. “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,

  12. ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.

  13. యెహోవా తన ప్రజలను తృణీకరించరు; ఆయన తన వారసత్వాన్ని ఎన్నడు విడిచిపెట్టరు.

  14. తీర్పు మళ్ళీ నీతి మీద స్థాపించబడుతుంది, యథార్థవంతులందరు దానిని అనుసరిస్తారు.

  15. యెహోవా నాకు సాయం చేసి ఉండకపోతే, నేను మౌన నిద్రలో నివసించేవాన్ని.

  16. “నా కాలు జారింది” అని నేను అన్నప్పుడు, యెహోవా, మీ మారని ప్రేమ నన్ను ఎత్తి పట్టుకున్నది.

  17. కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?

  18. దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?

  19. శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.

  20. దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.

  21. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

  22. వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.

  23. యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, అహరోను వంశాన్ని దీవిస్తారు.

  24. యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.

  25. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక.