కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.

  2. నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు. నాపై ఎవరు అభియోగాలు మోగపలరు? మనం కలిసి వాదించుకుందాం! నా ప్రతివాది ఎవడు? అతడు నన్ను ఎదిరించాలి!

  3. ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. నన్ను ఎవరు ఖండిస్తారు? వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెటలు వారిని తినివేస్తాయి.

  4. “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.

  5. వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”

  6. నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.

  7. తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;

  8. యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.

  9. ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.

  10. యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.

  11. అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.

  12. తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, నిండా అవమానం పాలుకానివ్వు.

  13. ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.

  14. ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.

  15. ఆ సమయంలో కొందరు కల్దీయ జ్యోతిష్యులు ముందుకు వచ్చి యూదుల మీద అభియోగం మోపారు.

  16. వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక!

  17. రాజా! మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు వినబడిన వెంటనే ప్రజలందరు సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని,

  18. ఎవరైతే సాగిలపడి పూజించరో, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం జారీ చేశారు.

  19. అయితే రాజా, మీరు బబులోను సామ్రాజ్య అధికారులుగా నియమించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యూదులు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వారు మీ దేవుళ్ళకు సేవ చేయడం లేదు, పూజించడం లేదు.”

  20. నెబుకద్నెజరు అతి కోపంతో మండిపోయి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. కాబట్టి వారిని రాజు సముఖానికి తీసుకువచ్చారు.

  21. అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా?

  22. ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు.

  23. షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు.

  24. ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు.

  25. రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు.