కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి,

  2. తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు.

  3. కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు.

  4. రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు.

  5. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు.

  6. అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు. “అవును రాజా!” అని వారు జవాబిచ్చారు.

  7. అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు.

  8. అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు. కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు.

  9. పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు.

  10. అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి స్తుతి! ఆయన తన దేవదూతను పంపి తన సేవకులను రక్షించారు! వారాయనను నమ్ముకొని రాజాజ్ఞను ధిక్కరించారు, తమ దేవున్ని తప్ప మరే దేవున్ని సేవించి పూజించమని, తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు.

  11. కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.”

  12. అప్పుడు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు.

  13. అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు.

  14. మీరు నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశారు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి, మీ అలలు, తరంగాలు నన్ను ముంచి వేశాయి.

  15. ‘నేను మీ సన్నిధి నుండి నన్ను తరిమివేసినా మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి చూస్తాను’ అనుకున్నాను.

  16. ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి, అగాధం నన్ను ఆవరించింది; సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది.

  17. పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను, క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి. అయితే నా దేవా! యెహోవా, మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.

  18. “నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.

  19. “విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.

  20. నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ మీకు బలి అర్పిస్తాను. నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను, ‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.”

  21. నేనైతే యెహోవా వైపు నిరీక్షణతో చూస్తాను, నా రక్షకుడైన దేవుని కోసం వేచి ఉంటాను; నా దేవుడు నా ప్రార్ధన వింటారు.

  22. నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.

  23. నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, ఆయన నాకు న్యాయం తీర్చేవరకు ఆయన నా పక్షాన ఉండే వరకు నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు, నేను ఆయన నీతిని చూస్తాను.

  24. దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు.

  25. “చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.