కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?

  2. యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను.

  3. మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  4. రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.

  5. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.

  6. మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.

  7. యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.

  8. కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.

  9. నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు.

  10. యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, మీ చేతిపనిని వదిలిపెట్టకండి.

  11. నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.

  12. ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.

  13. నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.

  14. నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.

  15. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;

  16. నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.

  17. నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.

  18. హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.

  19. యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.

  20. బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;

  21. భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”

  22. నీ దేవుడనైన యెహోవాను, నేను నీ కుడిచేతిని పట్టుకుని, భయపడకు అని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.

  23. భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

  24. అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.

  25. నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.