కంటెంట్‌కు వెళ్లండి

Beneficence గురించి బైబిల్ వచనాలు

93 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.

  2. నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను.

  3. సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.

  4. చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.

  5. ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.

  6. ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు.

  7. వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు.

  8. కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము.

  9. అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి.

  10. ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను.

  11. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.

  12. ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు.

  13. కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు.

  14. ఎందుకంటే, ఇవ్వాలనే ఆసక్తి మీకు ఉంటే, మీ సామర్థ్యాన్ని మించి కాకుండా మీకు ఉన్నదానిలో ఇచ్చే మీ కానుక అంగీకరించదగింది.

  15. మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక.

  16. ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారికవసరమైనది సరఫరా చేస్తుంది, అలాగే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధి మీకు అవసరమైనది సరఫరా చేస్తుంది. సమానత్వమే లక్ష్యం,

  17. ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

  18. పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

  19. సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా చెప్పి, అకాయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.

  20. అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను.

  21. ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీరే కాదు మీమీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు మేము కూడా సిగ్గుపడాల్సి ఉంటుంది.

  22. అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేలా సిద్ధపడి ఉండడానికి ప్రోత్సహించేలా మీ దగ్గరకు ముందుగానే సహోదరులను పంపడం అవసరమని నేను అనుకున్నాను.

  23. ఇది జ్ఞాపకం ఉంచుకోండి: కొంచెం విత్తినవానికి కొంచెం పంటే పండుతుంది. విస్తారంగా విత్తినవానికి విస్తారమైన పంట పండుతుంది.

  24. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారు కాబట్టి అయిష్టంగా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి.

  25. అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు.