కంటెంట్‌కు వెళ్లండి

Beneficence గురించి బైబిల్ వచనాలు

93 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దీని గురించి ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”

  2. విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు మీకు విత్తనం ఇచ్చి ఫలింపజేస్తారు, మీ నీతి పంటను విస్తరింపజేస్తారు.

  3. మీరు ప్రతి సమయంలో ధారాళంగా ఇవ్వడానికి మీరు అన్ని రకాలుగా సంపన్నులు అవుతారు. మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.

  4. మీరు చేసే ఈ పరిచర్య కేవలం పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాదు, దేవునికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెల్లించినట్టవుతుంది.

  5. ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.

  6. దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు.

  7. చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.

  8. నా గురించి మీరు తిరిగి మరల ఆలోచిస్తున్నారని ప్రభువులో ఎంతో సంతోషించాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, గాని దానిని చూపించడానికి తగిన అవకాశం మీకు దొరకలేదు.

  9. నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.

  10. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.

  11. నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.

  12. అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.

  13. అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు.

  14. నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు.

  15. నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.

  16. నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము.

  17. ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం?

  18. And one of you say unto them, Depart in peace, be ye warmed and filled; notwithstanding ye give them not those things which are needful to the body; what doth it profit?