కంటెంట్‌కు వెళ్లండి

Afflictions and Adversities గురించి బైబిల్ వచనాలు

526 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.

  2. మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; భూమి యొక్క లోతుల నుండి మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.

  3. నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం.

  4. దేవుని కోపం వారి మీదికి రగులుకొంది; వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు, ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు.

  5. ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు; ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.

  6. అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.

  7. దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.

  8. మీరు నన్ను లోతైన గుంటలో, చీకటి గుంటలో ఉంచారు.

  9. మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా

  10. మీ ఉగ్రత నన్ను ముంచేసింది; మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.

  11. కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు, మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు.

  12. మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి, అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు.

  13. మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు అతని బలమైన కోటలను పాడుచేశారు.

  14. దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.

  15. మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.

  16. నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు యుద్ధంలో అతనికి సాయం చేయలేదు.

  17. మీరు అతని వైభవాన్ని అంతం చేశారు అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.

  18. అతని యవ్వన దినాలను తగ్గించారు; అవమానంతో అతన్ని కప్పారు. సెలా

  19. మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.

  20. మమ్మల్ని బాధించినన్ని దినాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి.

  21. యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.

  22. దుష్టుని కోసం గొయ్యి త్రవ్వబడే వరకు, ఇబ్బంది దినాల నుండి మీరు వారికి ఉపశమనం కలిగిస్తారు.

  23. యెహోవా నాకు సాయం చేసి ఉండకపోతే, నేను మౌన నిద్రలో నివసించేవాన్ని.

  24. “నా కాలు జారింది” అని నేను అన్నప్పుడు, యెహోవా, మీ మారని ప్రేమ నన్ను ఎత్తి పట్టుకున్నది.

  25. ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి. మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది.