Skip to content

Hagar

12 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Agar

Hagar ను ప్రస్తావించే వచనాలు

  1. అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు;

  2. అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.

  3. అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.

  4. ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది.

  5. హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.

  6. హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

  7. అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి,

  8. మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.

  9. దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు.

  10. శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి:

  11. ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.

  12. హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది.