Skip to content

Justification గురించి బైబిల్ వచనాలు

132 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.

  2. అయితే ఇశ్రాయేలు సంతతివారందరు యెహోవాలోనే నీతిమంతులుగా తీర్చబడతారు, వారు ఆయనలోనే అతిశయిస్తారు.

  3. మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.

  4. నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.

  5. నా నీతి వేగంగా సమీపిస్తుంది, నా రక్షణ మార్గంలో ఉంది. నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది. ద్వీపాలు నా వైపు చూస్తాయి, నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి.

  6. ఆకాశాల వైపు మీ కళ్ళెత్తి చూడండి, క్రిందున్న భూమిని చూడండి; ఆకాశాలు పొగలా మాయమైపోతాయి, భూమి వస్త్రంలా పాతబడిపోతుంది దాని నివాసులు జోరీగల్లా చనిపోతారు. అయితే నా రక్షణ నిత్యం ఉంటుంది, నా నీతి ఎన్నటికీ విఫలం కాదు.

  7. సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి.

  8. “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు” అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.

  9. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.

  10. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు.

  11. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.

  12. క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు.

  13. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.

  14. అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది.

  15. క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.

  16. “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

  17. ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.”

  18. ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా.

  19. ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా!

  20. అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు.

  21. అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు.

  22. అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు.

  23. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు.

  24. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు.

  25. కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి.