Skip to content

Christian Liberty గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.

  2. యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.

  3. అది యాభైయవ వార్షికోత్సవం, మీకు పరిశుద్ధంగా ఉండాలి; నేరుగా పొలాల నుండి తీసుకున్న దానిని మాత్రమే తినాలి.

  4. “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు.

  5. “ ‘మీ సొంత ప్రజలకు స్థలమేదైన అమ్మినా లేదా వారి నుండి కొన్నా, ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం ఆశించకూడదు.

  6. గత యాభైయవ వార్షికోత్సవం తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క చూసి ఆ ప్రకారం మీ సొంత ప్రజల దగ్గర పొలం కొనాలి. పంట పండించడానికి మిగతా సంవత్సరాల లెక్క ప్రకారమే అతడు అమ్మాలి.

  7. సంవత్సరాలు చాలా ఉన్నప్పుడు, మీరు ధరను పెంచాలి, సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ధరను తగ్గించాలి, ఎందుకంటే మీకు నిజంగా అమ్మబడుతుంది పంటల సంఖ్య.

  8. ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం చూసుకోకూడదు కాని మీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  9. అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాము.

  10. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.

  11. To redeem them that were under the law, that we might receive the adoption of sons.

  12. వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు.

  13. దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.

  14. ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.

  15. హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది.

  16. కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి.