కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 48:16సుమారు క్రీ.పూ. 712

    “నా దగ్గరకు వచ్చి ఈ మాట విను: “మొదటి ప్రకటన నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు; అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను.” ఇప్పుడు ప్రభువైన యెహోవా తన ఆత్మతో నన్ను పంపారు.

  2. యెషయా 48:17సుమారు క్రీ.పూ. 712

    నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీ దేవుడనైన యెహోవాను నేనే, నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను.

  3. యెషయా 48:18సుమారు క్రీ.పూ. 712

    నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.

  4. యెషయా 48:19సుమారు క్రీ.పూ. 712

    నీ వారసులు ఇసుకలా, నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు. వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.

  5. యెషయా 48:20సుమారు క్రీ.పూ. 712

    బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.

  6. యెషయా 48:21సుమారు క్రీ.పూ. 712

    ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు; ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు. ఆయన బండను చీల్చారు, నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి.

  7. యెషయా 48:22సుమారు క్రీ.పూ. 712

    “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు.

  8. యెషయా 49:1సుమారు క్రీ.పూ. 712

    ద్వీపాల్లారా, నా మాట వినండి; దూరంగా ఉన్న దేశాల్లారా, ఇది వినండి: నేను పుట్టక ముందే యెహోవా నన్ను పిలిచారు. నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నా పేరు పలికారు.

  9. యెషయా 49:2సుమారు క్రీ.పూ. 712

    ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు, తన చేతి నీడలో నన్ను దాచారు; నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేసి తన అంబులపొదిలో నన్ను దాచారు.

  10. యెషయా 49:3సుమారు క్రీ.పూ. 712

    “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు. నీ ద్వారా నా మహిమను కనుపరుస్తాను” అని ఆయన నాతో చెప్పారు.

  11. యెషయా 49:4సుమారు క్రీ.పూ. 712

    అయితే నేను, “నేను వృధాగా కష్టపడ్డాను; ఫలితం లేకుండా నా బలాన్ని ఖర్చు చేశాను కాని ఖచ్చితంగా నా తీర్పు యెహోవా దగ్గరే ఉంది, నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది” అని అన్నాను.

  12. యెషయా 49:5సుమారు క్రీ.పూ. 712

    యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను నా దేవుడే నాకు బలంగా ఉన్నారు తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన, యెహోవా ఇలా అంటున్నారు:

  13. యెషయా 49:6సుమారు క్రీ.పూ. 712

    ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”

  14. యెషయా 49:7సుమారు క్రీ.పూ. 712

    రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన పాలకుల సేవకునితో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”

  15. యెషయా 49:8సుమారు క్రీ.పూ. 712

    యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,

  16. యెషయా 49:9సుమారు క్రీ.పూ. 712

    నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తాను. “వారు దారి ప్రక్కన తింటారు చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది.

  17. యెషయా 49:10సుమారు క్రీ.పూ. 712

    వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు.

  18. యెషయా 49:11సుమారు క్రీ.పూ. 712

    నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను నా రహదారులు ఎత్తు చేయబడతాయి.

  19. యెషయా 49:12సుమారు క్రీ.పూ. 712

    చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”

  20. యెషయా 49:13సుమారు క్రీ.పూ. 712

    ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.

  21. యెషయా 49:14సుమారు క్రీ.పూ. 712

    అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది.

  22. యెషయా 49:15సుమారు క్రీ.పూ. 712

    “తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను!

  23. యెషయా 49:16సుమారు క్రీ.పూ. 712

    చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.

  24. యెషయా 49:17సుమారు క్రీ.పూ. 712

    నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు. నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు.

  25. యెషయా 49:18సుమారు క్రీ.పూ. 712

    నీ కళ్ళెత్తి చుట్టూ చూడు; నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు. ‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు; పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు. నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.