కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 51:7సుమారు క్రీ.పూ. 712

    “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి.

  2. యెషయా 51:8సుమారు క్రీ.పూ. 712

    వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది.”

  3. యెషయా 51:9సుమారు క్రీ.పూ. 712

    యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా?

  4. యెషయా 51:10సుమారు క్రీ.పూ. 712

    సముద్రాన్ని లోతైన జలాలను ఎండిపోయేలా చేసింది నీవే కదా, విడిపించబడిన వారు దాటి వెళ్లేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నీవే కదా?

  5. యెషయా 51:11సుమారు క్రీ.పూ. 712

    యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.

  6. యెషయా 51:12సుమారు క్రీ.పూ. 712

    “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు?

  7. యెషయా 51:13సుమారు క్రీ.పూ. 712

    ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?

  8. యెషయా 51:14సుమారు క్రీ.పూ. 712

    క్రుంగిపోయిన ఖైదీలు త్వరలో విడుదల పొందుతారు; వారు తమ చెరసాల గోతిలో చనిపోరు. వారికి ఆహారం తక్కువకాదు.

  9. యెషయా 51:15సుమారు క్రీ.పూ. 712

    నేను మీ దేవుడనైన యెహోవాను, సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు.

  10. యెషయా 51:16సుమారు క్రీ.పూ. 712

    నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను ఆకాశాలను స్థాపించాను, భూమి పునాదులు వేసినవాడను ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.”

  11. యెషయా 51:17సుమారు క్రీ.పూ. 712

    యెరూషలేమా లే, మేలుకో, మేలుకో! యెహోవా ఉగ్రత పాత్రను ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు.

  12. యెషయా 51:18సుమారు క్రీ.పూ. 712

    ఆమెకు పుట్టిన పిల్లలందరిలో తనకు దారి చూపడానికి ఎవరూ లేరు; ఆమె పెంచిన పిల్లలందరిలో తన చేతిని పట్టుకునే వారెవరూ లేరు.

  13. యెషయా 51:19సుమారు క్రీ.పూ. 712

    ఈ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నిన్ను ఎవరు ఓదార్చగలరు? విధ్వంసం, వినాశనం, కరువు, ఖడ్గం నీ మీదికి వచ్చాయి, నిన్ను ఎవరు ఆదరించగలరు?

  14. యెషయా 51:20సుమారు క్రీ.పూ. 712

    నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.

  15. యెషయా 51:21సుమారు క్రీ.పూ. 712

    ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి శ్రమపడినదానా, ఈ మాట విను.

  16. యెషయా 51:22సుమారు క్రీ.పూ. 712

    తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు.

  17. యెషయా 51:23సుమారు క్రీ.పూ. 712

    ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

  18. యెషయా 52:1సుమారు క్రీ.పూ. 712

    సీయోనూ, మేలుకో మేలుకో, నీ బలాన్ని ధరించుకో! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని నీ లోనికి మరలా ప్రవేశించరు.

  19. యెషయా 52:2సుమారు క్రీ.పూ. 712

    నీ దుమ్ము దులుపుకో; యెరూషలేమా, లేచి కూర్చో. బందీగా ఉన్న సీయోను కుమారీ, నీ మెడకున్న సంకెళ్ళు తీసివెయ్యి.

  20. యెషయా 52:3సుమారు క్రీ.పూ. 712

    యెహోవా చెప్పే మాట ఇదే: “మీరు ఉచితంగా అమ్మబడ్డారు, డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.”

  21. యెషయా 52:4సుమారు క్రీ.పూ. 712

    ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలు మొదట నివసించడానికి ఈజిప్టుకు వెళ్లారు; తర్వాత అష్షూరు వారిని బాధించింది.

  22. యెషయా 52:5సుమారు క్రీ.పూ. 712

    “ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు రోజంతా నా నామం దూషించబడుతుంది” అని యెహోవా అంటున్నారు.

  23. యెషయా 52:6సుమారు క్రీ.పూ. 712

    “కాబట్టి నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు; కాబట్టి దీని గురించి ముందుగా చెప్పింది నేనని వారు తెలుసుకుంటారు. అవును, అది నేనే.”

  24. యెషయా 52:7సుమారు క్రీ.పూ. 712

    సువార్త ప్రకటిస్తూ, సమాధానాన్ని చాటిస్తూ, శుభవార్తను తీసుకువస్తూ, రక్షణ గురించి ప్రకటిస్తూ, సీయోనుతో, “నీ దేవుడు పాలిస్తున్నారు” అనే సువార్తను తెచ్చేవారి పాదాలు పర్వతాలమీద ఎంతో అందమైనవి.

  25. యెషయా 52:8సుమారు క్రీ.పూ. 712

    వినండి! మీ కావలివారు కేకలు వేస్తున్నారు; వారంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు వారు తమ కళ్లారా చూస్తారు.