కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 52:9సుమారు క్రీ.పూ. 712

    యెహోవా తన ప్రజలను ఆదరించారు, ఆయన యెరూషలేమును విడిపించారు. కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా, కలిసి సంతోషంతో పాటలు పాడండి.

  2. యెషయా 52:10సుమారు క్రీ.పూ. 712

    అన్ని దేశాలు చూస్తుండగా యెహోవా తన పరిశుద్ధ చేతిని విప్పుతారు. భూమి అంచుల వరకు ఉండేవారంతా మన దేవుని రక్షణను చూస్తారు.

  3. యెషయా 52:11సుమారు క్రీ.పూ. 712

    వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి! అపవిత్రమైన దానిని తాకకండి! యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా, అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.

  4. యెషయా 52:12సుమారు క్రీ.పూ. 712

    యెహోవా మీకు ముందుగా వెళ్తారు, ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కాపలా ఉంటారు. కాని మీరు తొందరగా బయలుదేరి వెళ్లరు. పారిపోతున్నట్లు వెళ్లరు.

  5. యెషయా 52:13సుమారు క్రీ.పూ. 712

    చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు; అతడు హెచ్చింపబడి ప్రసిద్ధిచెంది ఉన్నతంగా ఘనపరచబడతాడు.

  6. యెషయా 52:14సుమారు క్రీ.పూ. 712

    మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని అతని రూపం మనిషిలా లేదని అతన్ని చూసి అనేకమంది దిగ్భ్రాంతి చెందినట్లు,

  7. యెషయా 52:15సుమారు క్రీ.పూ. 712

    అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు, అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు. తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.

  8. యెషయా 53:1సుమారు క్రీ.పూ. 712

    మా సందేశాన్ని ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది?

  9. యెషయా 53:2సుమారు క్రీ.పూ. 712

    లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా అతడు ఆయన ఎదుట పెరిగాడు. మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు, మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.

  10. యెషయా 53:3సుమారు క్రీ.పూ. 712

    అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా, శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు. ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు; అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.

  11. యెషయా 53:4సుమారు క్రీ.పూ. 712

    ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు. మన రోగాలను భరించారు; అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.

  12. యెషయా 53:5సుమారు క్రీ.పూ. 712

    అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు. మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది. అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.

  13. యెషయా 53:6సుమారు క్రీ.పూ. 712

    మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము. మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు. యెహోవా మనందరి దోషాన్ని అతని మీద మోపారు.

  14. యెషయా 53:7సుమారు క్రీ.పూ. 712

    అతడు పీడించబడి బాధించబడినా అతడు తన నోరు తెరవలేదు; వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా, బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, ఆయన తన నోరు తెరవలేదు.

  15. యెషయా 53:8సుమారు క్రీ.పూ. 712

    అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు. అయినా అతని తరంలో నిరసన తెలిపింది ఎవరు? సజీవుల భూమి మీద నుండి అతడు తీసివేయబడ్డాడు; అతడు నా ప్రజల పాపాల కోసం శిక్షించబడ్డాడు.

  16. యెషయా 53:9సుమారు క్రీ.పూ. 712

    అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటిలో ఏ మోసం లేదు కాని అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు, ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.

  17. యెషయా 53:10సుమారు క్రీ.పూ. 712

    అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది.

  18. యెషయా 53:11సుమారు క్రీ.పూ. 712

    అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.

  19. యెషయా 53:12సుమారు క్రీ.పూ. 712

    కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.

  20. యెషయా 54:1సుమారు క్రీ.పూ. 712

    “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” అని యెహోవా తెలియజేస్తున్నారు.

  21. యెషయా 54:2సుమారు క్రీ.పూ. 712

    “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.

  22. యెషయా 54:3సుమారు క్రీ.పూ. 712

    నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.

  23. యెషయా 54:4సుమారు క్రీ.పూ. 712

    “భయపడకు; నీవు సిగ్గుపరచబడవు అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.

  24. యెషయా 54:5సుమారు క్రీ.పూ. 712

    నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.

  25. యెషయా 54:6సుమారు క్రీ.పూ. 712

    విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు, యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు” అని నీ దేవుడు చెప్తున్నారు.